త్రైత శకము - 46
భగవాన్ రావణ బ్రహ్మ యొక్క గొప్పతనమును, బ్రహ్మ విద్య యొక్క అవసరమును, మరియు త్రైత సిద్ధాంతము గురించి ప్రచురణలలో ఉన్న గ్రంథములను చదివి తెలుసుకోండి. గ్రంథములను కొనుటకు కానీ ఏవైనా ప్రశ్నలు అడుగుటకు కానీ ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా మాతో సంప్రదించండి.

సంఘం ముఖ్య ఉద్దేశాలు

  1. "విశ్వ సృష్టికర్త అయిన దేవుడు అందరికీ ఒక్కడే" అనే సత్యాన్ని సర్వమానవాళికి తెలియపరచుట.

  2. దేవుని జ్ఞానమైన బ్రహ్మవిద్యా శాస్త్రము అనగా దైవ గ్రంథములలోని ధర్మములను విశ్వ వ్యాప్తంగా ప్రచారం చేయుట.

  3. దైవజ్ఞాని, త్రికాలజ్ఞాని, అపరబ్రహ్మ, బహుముఖప్రజ్ఞాశాలి, మూడు యోగములు, మూడు ఆత్మల జ్ఞానము తెలిసిన యోగీశ్వరుడు, ఆది (ద్రావిడ) బ్రాహ్మణుడు, ద్రావిడేశ్వరుడు అయిన రావణబ్రహ్మ గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయుట.

  4. త్రికాలజ్ఞాని, అపరబ్రహ్మ శ్రీ రావణబ్రహ్మ పై ఇప్పటి వరకు గల చెడు ప్రచారమును త్రిప్పి కొట్టుట.

  5. ద్రావిడ అను పదము లో త్రైత సిద్ధాంతమైన మూడు ఆత్మల వివరం ఉన్నదని ద్రా, వి, డ అను అక్షరములు పరమాత్మ, ఆత్మ మరియు జీవాత్మ లను సూచించుచున్నవి అని తెలియజేయుట.

  6. ద్రావిడ అను పదమునకు నిజ అర్ధమును తెలియజేసి, క్షీణించిన ద్రావిడుల పూర్వ వైభవమును పునరుజ్జీవింప చేయుట.

  7. బ్రహ్మజ్ఞానము కలవారే నిజమైన బ్రాహ్మణులు అను సత్యమును సమాజానికి తెలియజేయుట.

  8. బ్రహ్మ విద్యా శాస్త్రములోని దైవజ్ఞాన ఆధారముగా అన్ని మతముల వారిని సమన్వయ పరచుట.

  9. దేవుడికి, భగవంతుడికి గల తేడాను తెలియజేయుట.

  10. దేవుడు మనిషి (భగవంతుడు) గా రావచ్చు కానీ, మనిషి మోక్షము పొందనంత వరకు దేవుడు కాలేడని సమాజమునకు అర్థం కావించుట.

  11. బ్రహ్మ విద్యా శాస్త్రములోని వాక్యములకు దేవుని విధానములోని భావమును విశదీకరించి చెప్పడము.

  12. బ్రహ్మ విద్యా శాస్త్ర అధ్యయనం, ఆచరణ కర్మక్షేపము నకు ఉన్నవని తెలియజేయుట.

  13. వేదాల, పురాణాల, ఇతిహాసాల పఠనము కాలక్షేపమునకు ఉన్నవని తెలియజేయుట.

  14. బ్రహ్మ విద్యా శాస్త్రములోని ధర్మములు దైవధర్మములనీ, అవి ప్రతి మనిషికీ సంబంధించినవనీ, ఆచరణకు ఎంతో సులువైనవనీ తెలియజేయుట.

  15. అధర్మములు నాలుగు అనీ, మూడు మాత్రమే ధర్మములు అనీ, ధర్మాచరణే ముక్తికి మార్గమని... అదే మానవుని ముఖ్య ఉద్దేశం కావాలని తెలియజేయుట. (భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 48, 53 శ్లోకములు)

  16. మానవ జన్మ యొక్క ప్రాధాన్యతను తెలియజేసి, తాను చేరవలసిన చివరి గమ్యము మోక్షమేనని, మోక్షమార్గమున నడచినప్పుడే మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ అగునని తెలియజేయుట.

  17. మూడు భాగములుగా ఉన్న దైవ గ్రంథములలోని జ్ఞాన విషయములను సంపూర్ణంగా తెలిసిన వారే నిజమైన ఆత్మజ్ఞాని కాగలరని సమాజానికి తెలియజేయుట.

  18. బ్రహ్మవిద్యా శాస్త్రమును ప్రపంచంలోని ఏ పుస్తకముల (వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు) తోనూ సరి పోల్చకుండా చూచుట.

  19. బ్రహ్మ విద్యా శాస్త్రములోని ఎదురాడని మరియు ప్రశ్నే మిగలని దైవ జ్ఞానమును సమాజమునకు అందించి, అందరూ బ్రాహ్మణత్వమును పొందునట్లు చేయుట.

  20. బ్రహ్మ అంటే పెద్ద అనీ, బ్రాహ్మణుడు అంటే పెద్దవాడు అనీ, చిన్నవాడిని పెద్దవాడిగా చేయుటయే ధ్యేయముగా కలిగి ఉండుట.