పురస్కారములు
పురస్కార వీడియో
     త్రైత సిద్ధాంతం సృష్టి ఆదిలో పరమాత్మచే నెలకొల్పబడినదై మహా వృక్షములాగా ఉండెడిది. కాలక్రమమున మోడువారినదై, మాయా ప్రభావము వలన మరుగున పడి పోయినది. త్రిమత ఏకైక గురువు , ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే 1978 లో తిరిగి వెలుగులోకి వచ్చినదై, త్రైత శకము ప్రారంభమైనది. ఇప్పుడు త్రైత శకము-45 జరుగుతున్నది. గత 42 సంవత్సరములుగా ప్రబోధాశ్రమములో మూడు దైవ గ్రంథముల ఆధారముగా, శాస్త్రబద్ధంగా, త్రైత సిద్ధాంత వివరణతో దైవ జ్ఞానము స్వామివారి రచనలు, ప్రవచనముల రూపములో బోధింపబడుతున్నది. ఇందూ జ్ఞానవేదిక తన ప్రచురణలలో గ్రంథములు, డివిడిల రూపములో జ్ఞానమును అందిస్తున్నది. ప్రపంచ ఆధ్యాత్మిక రంగములో శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు రచించిన శతాధిక, సంచలనాత్మక, ఆధ్యాత్మిక గ్రంథములను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పరిశీలించి యోగీశ్వరుల వారి వంద రచనలను రికార్డ్ గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ధృవీకరించడమైనది.